Illegal affair: భర్తకు డబ్బు పిచ్చి, భార్యకు మగాళ్ల పిచ్చి, పిన్ టూ పిన్ రాసి చెరువులో దూకిన భర్త!

0
508

బెంగళూరు/మండ్య: వివాహం చేసుకున్న వ్యక్తి భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్నాడు. దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. కూలీలను పెట్టుకుని వ్యవసాయం చేయిస్తున్న భర్త బయట వ్యాపారం చేస్తున్నాడు. వ్యవసాయం, వ్యాపారం విషయాల్లో భర్త ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. భర్త డబ్బులు సంపాధించడానికి బయట తిరుగుతుంటే అతని భార్య పరాయి పురుషుల వ్యామోహంలో పడిపోయింది. పక్కఊర్లో ఉంటున్న ఎల్ఐసీ ఏజెంట్ తో పరిచయం పెంచుకున్న భార్య అతనితో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేసింది. ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న మహిళ ఆమె భర్త లెక్కలేకుండా మాట్లాడటం మొదలుపెట్టింది. పద్దతి మార్చుకోవాలని భర్త అతని భార్యకు నచ్చ చెబుతూ వచ్చాడు.

భార్య, కొడుకుతో హ్యాపీ

కర్ణాటకలోని మండ్య జిల్లా, నాగమంగల తాలుకాలోని పిట్టకోప్పలు సమీపంలోని చెన్నాపురలో గంగాధరగౌడ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 8 సంవత్సరాల క్రితం గంగాధరగౌడ సింధూ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. సింధూను వివాహం చేసుకున్న గంగాధరగౌడ అతని భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్నాడు. గంగాధరగౌడ, సింధూ దంపతులకు జస్మిత్ (6) అనే కుమారుడు ఉన్నాడు

 

భర్తకు డబ్బు పిచ్చి…..

భార్యకు మగాళ్ల పిచ్చి కూలీలను పెట్టుకుని వ్యవసాయం చేయిస్తున్న గంగాధరగౌడ బయట వ్యాపారం చేస్తున్నాడు. వ్యవసాయం, వ్యాపారం విషయాల్లో గంగాధరగౌడ ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. గంగాధరగౌడ డబ్బు పిచ్చితో డబ్బులు సంపాధించడానికి బయట తిరుగుతుంటే అతని భార్య సింధూ పరాయి పురుషుల పిచ్చితో వారి వ్యామోహంలో పడిపోయింది.

భార్యకు ఎల్ఐసీ ఏజెంట్ ప్రియుడు నాగమంగల తాలుకాలోనే గరుడాపురలో బిసి. నంజుండేగౌడ అనే ఎల్ఐసీ ఏజెంట్ నివాసం ఉంటున్నాడు. పక్కఊర్లో నివాసం ఉంటున్న ఎల్ఐసీ ఏజెంట్ నంజుండేగౌడతో పరిచయం పెంచుకున్న గంగాధరగౌడ భార్య సింధూ అతనితో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేసింది. ఎల్ఐసీ ఏజెంట్ ప్రియుడు నంజుండేగౌడో సింధూ చెట్టాపట్టాలు వేసుకుని తిరిగింది.

గత ఏడాది గంగాధరగౌడకు అతని భార్య సింధూ, ఎల్ఐసీ ఏజెంట్ నంజుండేగౌడ అక్రమ సంబంధం విషయం తెలిసిపోయింది. భార్య సింధూ, నంజుండేగౌడ అక్రమ సంబందం విషయం గురించి పదిమంది పది రకాలుగా మాట్లాడుకోవడంతో గంగాధరౌడ ఆవేదనతో కుమిలిపోయాడు. పద్దతి మార్చుకోవాలని సింధూకు ఆమె భర్త గంగాధరగౌడ నచ్చ చెబుతూ వచ్చాడు.

 

భార్యను ఏమీ చెయ్యలేక కొడుకుతో కలిసి భర్త ఆత్మహత్య ప్రియుడు నంజుండేగౌడతో ఎంజాయ్ చేస్తున్న సింధూ ఆమె భర్త గంగాధరగౌడను లెక్కలేకుండా మాట్లాడటం మొదలుపెట్టింది. అయితే భార్య సింధూ పద్దతి మార్చుకోలేదని రగిలిపోయిన ఆమె భర్త గంగాధరగౌడ ఆమెను ఏమీ చెయ్యలేకపోయాడు. కొడును జస్విత్ (6)ను వెంట పిలుచుకుని వెళ్లిన గంగాధరగౌడ చెన్నాపున చెరువులో దూకి ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు.

డెత్ నోట్ లో పిన్ టూ పిన్ రాసిపెట్టిన భర్త గంగాధరగౌడ అతని కొడుకుతో కలిసి ఆత్మహత్య చేసుకునే ముందు డెత్ నోట్ లో అతని భార్య సింధూ, ఆమె ప్రియుడు ఎల్ఐసీ ఏజెంట్ నంజుండేగౌడ గురించి పిన్ టూ పిన్ రాసిపెట్టారు. తన భార్య సింధూ, ఆమె ప్రియుడు నంజుండేగౌడ కలిసి మా పరువు తీస్తున్నారని, మా కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా వారు పద్దతి మార్చుకోలేదని, మా ఆత్మహత్యలకు నా భార్య సింధూ, ఆమె ప్రియుడు నంజుండేగౌడ కారణం అని గంగాధర్ గౌడ డెత్ నోట్ లో రాసిపెట్టాడని పోలీసులు అన్నారు.

పోలీసులు వెతుకుతున్నారని చెరువులో దూకిన కిలాడీ భార్య

పోలీసులు సింధూ ఆమె ప్రియుడు నంజుండేగౌడ కోసం గాలించారు. తన అక్రమ సంబంధం విషయంలోనే తన భర్త గంగాధరగౌడ, కొడుకు జస్విత్ ఆత్మహత్య చేసుకున్నారని, పోలీసులు తన కోసం వెతుకుతున్నారని తెలుసుకున్న కిలాడీ లేడీ సింధూ తరువాత ఆమె కూడా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవాలన ప్రయత్నించింది.

 

పాపి చిరాయువు….. బతికిపోయింది అయితే పాపి చిరాయువు అన్నట్లు సింధూ చెరువులో దూకిని విషయం గమనించిన స్థానికులు ఆమెను ప్రాణాలు బయటకు లాగి ఆసుపత్రికి తరలించారు. సింధూ కోలుకున్న తరువాత ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తామని పోలీసులు అంటున్నారు. భార్య అక్రమ సంబంధం కారణంగా భర్త, కొడుకుతో పాటు పండుగ రోజు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here